Ad Code

మణిపూర్ లో ఇంటిపై రాకెట్ దాడి : ఇద్దరు చిన్నారులు మృతి


ణిపూర్ లో గుర్తు తెలియని దుండగులు జరిపిన రాకెట్ దాడి కారణంగా ఇద్దరు చిన్నారులు మరణించగా, వారి తల్లి గాయపడింది. దీంతో ఘటన జరిగిన బిష్ణాపూర్ జిల్లాలో ఆందోళనలు చెలరేగాయి. ఈ కారణంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు ఇంటర్నెట్ బంద్ చేశారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు. గతంలో ఘర్షణలు జరిగిన ప్రాంతాల్లో బిష్ణాపూర్ జిల్లా కూడా ఒకటి. ఈ జిల్లాలోని మోయిరంగ్ ప్రాంతంలోని ట్రోంగ్లాబి అవాంగ్ లైకై అనే గ్రామంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత ఒక ఇంటిపై కొందరు దుండుగులు రాకెట్ దాడి చేశారు. ఈ దాడిలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలు మరణించారు. వారి తల్లి గాయపడ్డారు. మృతుల్లో ఐదేళ్ల బాలుడు, ఆరు నెలల పాప ఉంది. ఈ దాడి ఘటనతో మరోసారి ఈ ప్రాంతంలో ఉద్రిక్తత తలెత్తింది. స్థానికులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. దగ్గర్లోని ఆయిల్ ట్యాంకులు, ట్రక్కులు తగలబెట్టారు. ఆస్తులు ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు, భద్రతా దళాలు అక్కడికి చేరుకుని శాంతింపజేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. ఈ ఘటనలో 19 వరకు గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘర్షణలు మరింత చెలరేగకుండా అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తప్పుడు సమాచారం వ్యాపించకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా బిష్ణాపూర్‌తోపాటు మరో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేశారు. కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఈ ఘటనను మణిపూర్ సీఎం వై ఖేంచంద్ సింగ్ ఖండించారు. ఇంటిపై రాకెట్‌తో దాడి చేయడాన్ని తీవ్రవాద చర్యగా అభివర్ణించారు. 

Post a Comment

0 Comments

Close Menu