హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించిన ఇరాన్ !


హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ నిర్ణయం అంతర్జాతీయంగా పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ వెల్లడించిన ప్రకారం అన్ని వాణిజ్య నౌకల రాకపోకలకు అనుమతి ఇస్తూ హర్మూజ్ జలసంధిని తిరిగి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చినట్టు స్పష్టం చేశారు. లెబనాన్‌లో పరిస్థితులు శాంతించడంతో పాటు.. కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నంత వరకు ఈ నిర్ణయం కొనసాగుతుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదికగా కూడా ప్రకటించారు. హర్మూజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఆయిల్ ట్రాన్సిట్ మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద శాతం ఈ మార్గం ద్వారానే సాగుతుంది. కాబట్టి ఈ మార్గం మూసివేయబడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దీన్ని మళ్లీ తెరవడం వల్ల గ్లోబల్ ఆయిల్ ధరలు స్థిరపడే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఇరాన్ పోర్ట్స్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ సమన్వయంలో నౌకల రాకపోకలు సజావుగా సాగుతాయని అధికారులు తెలిపారు. భద్రతా చర్యలను కట్టుదిట్టం చేస్తూ, అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ పరిణామంపై స్పందించిన డొనాల్డ్ ట్రంప్ తన 'ట్రూత్ సోషల్' వేదికగా ఇరాన్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ, "హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవడం మంచి పరిణామం. దీనివల్ల ప్రపంచ వాణిజ్యానికి ఊరట లభిస్తుంది" అని వ్యాఖ్యానించారు. ఇరాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం