Ad Code

ఇన్‌-యాప్‌ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ ఫీచరును ప్రవేశపెట్టిన ఓలా ఎలక్ట్రిక్‌


ఓలా ఎలక్ట్రిక్‌ కొత్తగా ఇన్‌-యాప్‌ సర్వీస్ అపాయింట్‌మెంట్‌ ఫీచరును ప్రవేశపెట్టింది. దీనితో కంపెనీ యాప్‌ ద్వారా యూజర్లు తమకు కావాల్సిన సర్వీస్‌ స్లాట్లను బుక్‌ చేసుకోవచ్చు. సర్వీస్‌ పరిస్థితిని ట్రాక్‌ చేసుకోవచ్చు. అలాగే సర్వీస్‌కి సంబంధించిన విషయాలన్నీ ఒకే చోట సమగ్రంగా చూసుకోవచ్చు. సంప్రదాయ సర్వీస్‌ బుకింగ్‌ విధానంలో ఎదురయ్యే సవాళ్లను తొలగించే విధంగా ఇది ఉంటుందని కంపెనీ తెలిపింది. సిసలైన, అత్యంత నాణ్యమైన విడిభాగాలు, ప్రామాణిక సర్వీస్‌ ప్రక్రియలు యూజర్లకు లభిస్తాయని పేర్కొంది. కస్టమర్లు, స్వతంత్ర గ్యారేజ్‌లు, ఫ్లీట్‌ ఆపరేటర్లకు కూడా తమ స్పేర్‌ పార్టులు, డయాగ్నోస్టిక్‌ సాధనాలు, శిక్షణ మొదలైనవి అందుబాటులో ఉండేలా ఓలా ఇటీవలే హైపర్‌సర్వీస్‌ ప్లాట్‌ఫాంని ఆవిష్కరించింది.

Post a Comment

0 Comments

Close Menu