406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగిన ఎంజీ మాజెస్టర్ కారు : గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు


ఎంజీ మోటార్ ఇండియా నుండి రాబోయే ఎస్ యూ వీ ఎంజీ మాజెస్టర్ కారు ప్రీ-లాంచ్ దశలోనే సంచలనం సృష్టిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌ లో చోటు సంపాదించింది. కారు పవర్, ఇంజినీరింగ్ సామర్థ్యాన్ని చూపుతూ ఈ SUV రైలును సునాయాసంగా లాగింది. మార్చి 31న జమ్మూ కాశ్మీర్‌ లోని కాకపోరా-అవంతిపోరా మధ్య ప్రత్యేకంగా సిద్ధం చేసిన రైల్వే ట్రాక్‌పై ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీ మాజెస్టర్ ఏకంగా 406.4 టన్నుల బరువున్న రైలును 300 అడుగులకుపైగా లాగింది. గిన్నిస్ ప్రమాణాల ప్రకారం కనీసం 400 టన్నులు, 100 అడుగుల దూరం అవసరం ఉండగా.. ఈ SUV కారు వాటిని సులభంగా అధిగమించింది. దీంతో SUV ద్వారా రైలును లాగిన ప్రపంచంలోనే అతిపెద్ద రికార్డుగా నమోదయ్యింది. ఈవెంట్ లో ఉపయోగించిన వాహనం పూర్తిగా స్టాండర్డ్ ప్రొడక్షన్ కారు మాత్రమే. ఎలాంటి ఇంజిన్, డ్రైవ్‌ట్రెయిన్ లేదా ట్రాక్షన్ మార్పులు చేయకుండా ఈ ఘనత సాధించింది. ఈ ఎంజీ మోటార్ లో WAG-9HC లోకోమోటివ్, ప్యాసింజర్ కోచ్‌లు, గార్డ్ కోచ్ ఉన్న రైలు పూర్తిగా SUV శక్తితోనే కదిలిందని నిపుణులు ధృవీకరించారు. ఎంజీ మాజెస్టర్ లో  2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్ ఉంటుంది. ఇది 215bhp పవర్, 478.5Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ ఇంజిన్ జతచేయబడింది. ఈ SUVలో ట్రిపుల్ డిఫరెన్షియల్ లాక్స్ (ఫ్రంట్, రియర్, సెంటర్), అడ్వాన్స్‌డ్ 4WD సిస్టమ్, మల్టిపుల్ టెర్రెయిన్ మోడ్స్, క్రాల్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆఫ్-రోడ్ సామర్థ్యాల విషయంలో కూడా ఇది బలంగా నిలుస్తుంది. 219mm గ్రౌండ్ క్లియరెన్స్, 810mm వరకు వాటర్ వాడింగ్ కెపాసిటీతో ఈ SUV ఫుల్-సైజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఎంజీ మాజెస్టర్ ను  ప్రీమియం D+ సెగ్మెంట్ SUVగా పొజిషన్ చేస్తున్నారు. ఇది కంపెనీ ప్రస్తుత ఫ్లాగ్‌షిప్ మోడల్ MG Gloster కంటే పై స్థాయిలో ఉంటుంది. ఇప్పటికే రూ.41,000తో ప్రీ-బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ప్రారంభ వినియోగదారులకు ఐదేళ్ల అన్‌లిమిటెడ్ కిలోమీటర్ వారంటీ, ఫ్రీ రోడ్‌సైడ్ అసిస్టెన్స్, ప్రాధాన్యత డెలివరీలు, ప్రత్యేక డ్రైవింగ్ అనుభవాలు వంటి ప్రయోజనాలు అందించనున్నారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains