Ad Code

ఫెయిలవుతాననే భయంతో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య : ఫలితాల్లో 347 మార్కులతో పాస్


తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలం రాపల్లి గ్రామానికి చెందిన గంగదేవుళ్ల అక్షాంత్ అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి, మధిర సమీపంలో రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నాడు. అయితే, ఆదివారం విడుదలైన ఫలితాల్లో అక్షాంత్ 347 మార్కులతో పాస్ అయినట్లు తేలింది. కొడుకు మంచి మార్కులతో ఉత్తీర్ణుడైన ఆనందం కంటే, ఫలితాలు రాకముందే తనువు చాలించాడనే వార్త ఆ కుటుంబాన్ని కలిచివేస్తోంది. ఈ ఘటనతో రాపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu