ఢిల్లీలో మద్యం వ్యాపారి ఇంట్లో పనిమనిషిగా చేరిన వ్యక్తి తన అనుచరులతో కలిసి దోపిడీకి పాల్పడ్డాడు. వ్యాపారి కుటుంబ సభ్యులను వారు నిర్బంధించి రూ.25 లక్షల విలువైన నగలను దోచుకున్నారు. గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ఆరుగురు వ్యక్తులు ఆ ఇంట్లోకి ప్రవేశించారు. వృద్ధ జంటను, వారి కోడలు, పిల్లలను ఒక గదిలో నిర్బంధించి రూ.25 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దోచుకుని పారిపోయారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యాపారి ఇంటికి చేరుకున్నారు. పనిమనిషి సుశీల్ పక్కా ప్లాన్, రెక్కీ నిర్వహించిన తర్వాత తన వారితో కలిసి ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అతడ్ని నియమించిన సంస్థ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలించారు. కాల్ డాటా వంటి సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఉత్తర ప్రదేశ్, హర్యానాతో సహా పలు రాష్ట్రాల్లో నిందితుల కోసం వెతుకుతున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.
0 Comments