Ad Code

రాబోయే 12 గంటలు రైలు ప్రయాణాలు చేయవద్దని ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరిక


రాన్‌లోని రైళ్ల రాకపోకలు లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఇరాన్ ప్రజలకు ఇజ్రాయెల్ హెచ్చరికలు జారీ చేసింది. రాబోయే 12 గంటల పాటు రైలు ప్రయాణాలు చేయొద్దని, రైలు మార్గాలకు సమీపంలో ఉండే ప్రజలు దూరంగా వెళ్లిపోవాలని సూచించింది. ఈ మేరకు 'ఎక్స్' ఖాతాలో ఐడీఎఫ్ పోస్ట్ చేసింది. ఇరాన్ ప్రజలు మంగళవారం రాత్రి తొమ్మిది గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న రైళ్ల మార్గాలకు దూరంగా ఉండాలని ఇజ్రాయెల్ హెచ్చరించింది. రైలు ప్రయాణాలు మానుకోవాలని ఆ పోస్టులో పేర్కొంది. అక్కడ మీరు ఉంటే మీ ప్రాణాలకు ముప్పు ఏర్పడవచ్చని సున్నితంగా హెచ్చరించింది. ఇరాన్ కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల నుంచి ఇది వర్తిస్తుందని తెలిపింది.దీనిని అత్యవసర హెచ్చరికగా పేర్కొంది. అయితే ఏ ఏ ప్రాంతాల్లోని రైల్వే మార్గాలు అనే విషయాన్ని మాత్రం అందులో స్పష్టం చేయలేదు.

Post a Comment

0 Comments

Close Menu