వివో Y21 5G, Y11 5G ఫోన్లు విడుదల


దేశీయ మార్కెట్లో వివో Y21 5G, Y11 5G కొత్త ఫోన్లు లాంచ్ చేసింది. ఈ రెండు స్మార్ట్ ఫోన్లను కూడా బడ్జెట్ ధరలో బిగ్ డిస్ప్లే మరియు బిగ్ బ్యాటరీ తో విడుదల చేసింది. వివో వై 11 ఫోన్ బేసిక్ (4 జీబీ + 64 జీబీ) వేరియంట్ ను రూ. 14,999 ధరతో మరియు హై ఎండ్ (4 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 16,999 ధరతో లాంచ్ చేసింది. వివో వై 21 5జి ఫోన్ (4 జీబీ + 128 జీబీ) బేసిక్ వేరియంట్ ను రూ. 18,999 ధరతో, (6 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 20,999 ధరతో మరియు హై ఎండ్ (8 జీబీ + 128 జీబీ) వేరియంట్ ను రూ. 22,999 ధరతో లాంచ్ చేసింది. పైన తెలిపిన ఈ ఫోన్ ధరలు ఆఫర్స్ తో కలిపి అందించిన ధరలు. వివో వై 21 5జి ఫోన్ పై రూ. 1,500 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ మరియు వివో వై 11 5జి ఫోన్ పై రూ. 1,000 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్స్ అందించింది. ఈ ఫోన్లు వివో ఇ స్టోర్, Flipkart ఫ్లిప్ కార్ట్ మరియు అన్ని ప్రధాన రిటైల్ స్టోర్ ద్వారా ఈ సేల్ చేస్తుంది. వివో ఈ రెండు స్మార్ట్ ఫోన్లను ఒకే విధమైన డిజైన్ మరియు దాదాపు ఓకే విధమైన ఫీచర్స్ తో కూడా అందించింది. కెమెరా మరియు ఛార్జ్ సపోర్ట్ విషయం లో మాత్రమే ఈ రెండు ఫోన్లు వ్యత్యాసం కలిగి ఉంటాయి. వివో y21 మరియు వై లెవెన్ రెండు స్మార్ట్ ఫోన్లు కూడా 6.74 ఇంచ్ డిస్ప్లే కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు మంచి బ్రైట్నెస్ సపోర్ట్ కూడా కలిగి ఉంటాయి. వీటిలో మీడియాటెక్ Dimensity 6300 చిప్ సెట్ తో అందించింది. వివో 21 స్మార్ట్ ఫోన్ లో 8 జీబీ వరకు గరిష్ట ర్యామ్ మరియు వివో 11 స్మార్ట్ ఫోన్ లో 6 జీబీ వరకు గరిష్ట ర్యామ్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా గరిష్టంగా 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటాయి. రెండు ఫోన్లు కూడా డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ కలిగి ఉంటాయి. అయితే, వై 21 లో 50MP మెయిన్ కెమెరా ఉంటే వై 11 ఫోన్ లో మాత్రం 13MP మెయిన్ కెమెరా మాత్రమే ఉంటుంది. కానీ ఈ రెండు ఫోన్లు కూడా 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు AI కెమెరా ఫిల్టర్లు మరియు ఫీచర్లు కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు కూడా 6,500 బ్యాటరీ ఉంటాయి. అయితే, వై 11 ఫోన్ 15W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మాత్రమే కలిగి ఉంటే వివో వై 21 ఫోన్ మాత్రం 44W ఫాస్ట్ చార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains