Ad Code

ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదని తల్లిని చంపి ఇంట్లోనే పాతిపెట్టిన కూతురు !


తెలంగాణ లోని మేడ్చల్ జిల్లా కౌకూరులో  ప్రియుడి మోజులో కన్న తల్లిని కిరాతకంగా కుమార్తె చంపింది. ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ అమానుష ఘటనను ఏడాది తర్వాత పోలీసుల విచారణలో బయటపడింది. గత ఏడాది మే నెలలో తల్లి అంజును చిన్నకూతురు ఇషిక తన ప్రియుడి సాయంతో హత్య చేసింది. ఆపై నేరం నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని ఇంట్లోనే పాతిపెట్టింది. తల్లి అంజు కనిపించడం లేదంటూ పెద్ద కూతురు పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోచేసుకున్న పోలీసులు ఏడాది పాటు దర్యాఫ్తు చేశారు. ఈ క్రమంలోనే చిన్న కూతురు ఇషిక, ఆమె భర్తను సైతం పోలీసులు పలుమార్లు విచారించగా కట్టుకథలు చెప్పి తప్పుదోవ పట్టించారు. చివరికి సాంకేతిక ఆధారాలతో నిందితుల బండారాన్ని పోలీసులు బట్టబయలు చేశారు. ఇషిక ఇంట్లో తవ్వకాలు జరిపి అంజు అవశేషాలను వెలికితీశారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు. నిందితులు ఇషిక, ఆమె భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించారు. ప్రియుడి కోసం కన్న తల్లిని కిరాతకంగా చంపిన నిందితురాలిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 2025 మేలో అదృశ్యమైన అంజు కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. అంజు కన్నకూతురి చేతిలో దారుణ హత్యకు గురైన విషయం బయటపడింది. ప్రియుడి సాయంతో తల్లిని హత్య చేసిన కూతురు.. అతడి సాయం తీసుకుని తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే పూడ్చిపెట్టింది. లోతైన విచారణలో అసలు నిజం పోలీసులు బయటపెట్టారు . ప్రియుడితో పెళ్లికి ఒప్పుకోలేదనే కారణంతో తల్లి అంజుని కూతురు ఇషిక అత్యంత కిరాతకంగా హత మార్చిందని పోలీసులు తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu