హైదరాబాద్ నుండి ఫుకెట్ బయల్దేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ థాయిలాండ్‌లోని ఫుకెట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అవుతుండగా విమానం ముందు చక్రం ఊడిపోయింది. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రకటన ప్రకారం.. ఎయిర్ ఇండియాకు చెందిన AXB938, బోయింగ్ 737-800 ఎక్స్‌ప్రెస్ విమానం 131 మంది ప్రయాణికులతో హైదరాబాద్ నుంచి బయల్దేరి బుధవారం ఉదయం 11:40కి గంటలకు పుకెట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంది. అయితే సరిగ్గా ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు టైర్ సాంకేతిక సమస్య కారణంగా ఊడిపోయింది. అయితే ఈ ప్రమాదంలో విమానానికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే అలర్ట్ అయిన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకొని విమానంలోని ప్రయాణికులందరినీ సేఫ్‌గా టెర్మినల్‌లోకి తరలించారు.ఇందుకు సహకరించిన ఫుకెట్ విమానాశ్రయ అధికారులకు, వారి సహకారానికి ఎయిర్‌లైన్ ధన్యవాదాలు తెలిపింది. అయితే ప్రాథమిక తనిఖీల్లో విమానం హార్డ్ ల్యాండింగ్ కావడం వల్ల నోస్ వీల్ దెబ్బతింటుందని తేలింది. అయితే ఈ సంఘటన కారణంగా ఫుకెట్ విమానాశ్రయం మధ్యాహ్నం 12.08 నుండి సాయంత్రం 6.00 గంటల వరకు తాత్కాలిక రన్‌వే మూసివేసింది. అలాగే ఫుకెట్‌లో ల్యాండ్ కావాల్సిన అన్ని విమానాలు ప్రత్యామ్నాయ విమానాశ్రయాలను ఉపయోగించుకోవాలని ప్రకటన జారీ చేసింది.
0 Comments