హైదరాబాద్‌లోని బేగంపేటలో వాతావరణ శాఖ కార్యాలయానికి బాంబు బెదిరింపు వచ్చింది దీంతో పోలీసులు అప్రమత్తమై కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. ఈ కేంద్రానికి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బాంబు బెదిరింపు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలు కార్యాలయం అంతటా క్షుణ్నంగా తనిఖీలు చేపట్టాయి. నిత్యం వాతావరణ సమాచారంతో బిజీగా ఉండే అధికారులు, సిబ్బంది ఈ ఆకస్మిక పరిణామంతో తీవ్ర టెన్షన్‌లో ఉన్నారు.
0 Comments