Ad Code

డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో డివైడర్‌ను ఢీకొట్టిన బస్సు : నలుగురి దుర్మరణం


బెంగళూరు- మైసూరు జాతీయ రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడంతో నలుగురు అక్కడికక్కడే మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. కేరళ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు డ్రైవర్ నిద్రలోకి జారుకోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో కేరళకు చెందిన మహమ్మద్ పరాన్(22), రఫీజ్(45), బెంగళూరు వాసులు రషీద్(45), సాకిర్(27) ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గాయపడిన వారిని చన్నపట్న ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 

Post a Comment

0 Comments

Close Menu