Ad Code

నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను - ఎన్టీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదు : టీవీకే అధినేత విజయ్


మిళనాడు ఎన్నికలలో పొత్తులపై టీవీకే అధినేత విజయ్ మాట్లాడుతూ నేను ఎవరితోనూ పొత్తు పెట్టుకోను అని స్పష్టం చేశారు.. ముఖ్యంగా ఎన్టీఏ కూటమిలోకి వెళ్లే ప్రసక్తే లేదని విజయ్ స్పష్టం చేశారు. మరోవైపు నన్ను అణిచివేయాలని కుట్రలు చేస్తున్నారు అని కూడా విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులో టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందనే నమ్మకాన్ని టీవీకే అధినేత విజయ్‌ వ్యక్తం చేశారు. కాగా టీవీకే-బీజేపీ పొత్తుల కోసం సినీ నటి త్రిష రంగంలోకి దిగిందని, ఏకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతోనూ చర్చలు జరిపినట్టు కూడా సోషల్‌ మీడియాలో కొంత ప్రచారం సాగుతోన్న విషయం విదితమే. మరోవైపు విజయ్‌కు ఒక జాతీయ పార్టీ సీఎం పదవి ఆఫర్ చేసిందని టీవీకే నేత అధవ్ అర్జున సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ ఆఫర్‌ను విజయ్ తిరస్కరించినట్లు అర్జున తెలిపారు. తమిళ రాజకీయాల్లో విజయ్‌ ప్రభావం స్పష్టంగా ఉంటుందని, అందుకే విజయ్‌ను తమ వైపు తిప్పుకొనేందుకు జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నిస్తున్నాయనే ప్రచారం కూడా సాగుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu