Ad Code

ఇరాన్ సుప్రీం లీడర్ ‎గా బాధ్యతలు తీసుకోమన్నారు, నేనే తిరస్కరించాను !


రాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం తర్వాత సుప్రీం  లీడర్ ‎గా తనను బాధ్యతలు తీసుకోవాలని ఇరాన్ కోరిందని, కానీ ప్రపోజల్ తాను తిరస్కరించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్పుకొచ్చాడు. అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపడం లేదన్న ఇరాన్ వ్యాఖ్యలను కూడా ట్రంప్ తోసిపుచ్చారు. ఇరాన్ ‎తో చర్చలు కొనసాగుతున్నాయని, ఆ దేశ ప్రభుత్వం కూడా కాల్పుల విరమణకు ఆసక్తిగా ఉన్నప్పటికీ స్వదేశంలో ఎదురయ్యే పరిణామాలకు భయపడి వెనకడుగు వేస్తోందన్నారు. ఇరాన్‌పై జరిగిన ఆపరేషన్‌ను సైనిక విధ్వంసంగా అభివర్ణించి ట్రంప్, యుద్ధంలో అమెరికా విజయం సాధించిందని పునరుద్ఘాటించారు. నెల రోజులుగా సాగుతోన్న యుద్ధాన్ని ఆపేందుకు ఇరాన్ కు అమెరికా 15 షరతులతో కూడిన శాంతి ప్రణాళిక ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అయితే, అమెరికా ప్రపోజల్‎ను ఇరాన్ తిరస్కరించింది. కౌంటర్ గా ఇరాన్ కూడా రిటర్న్ కండిషన్స్ పెట్టింది. అమెరికా తమ డిమాండ్లకు ఒప్పుకుంటేనే యుద్ధం ఆగుతుందని తేల్చిచెప్పింది. అంతేకాకుండా ఇప్పటి వరకు అమెరికాతో ఎలాంటి శాంతి చర్చలు జరపలేదని స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu