బెంగళూరులో సరైన అడ్రస్ కు రమ్మన్న కస్టమర్ బ్లింకిట్ డెలివరీ బాయ్ ముక్కు పగులగొట్టి, అతడు ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పడేసి పరారయ్యాడు. బాధితుడు పాల్ జె. వితాయతిల్ మార్చి 7వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత (సుమారు 2.00 గంటలకు) బ్లింకిట్ యాప్ ద్వారా ఆయన కొన్ని వస్తువులను ఆర్డర్ చేశారు. అయితే డెలివరీ ఏజెంట్ వితాయతిల్ ఇంటికి రాకుండా వేరే లొకేషన్‌కు వెళ్లాడు. దీంతో కస్టమర్ ఫోన్ చేసి సరైన చిరునామాకు రావాలని కోరారు. ఈ క్రమంలో ఫోన్లోనే ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటి తర్వాత బాధితుడి ఇంటికి చేరుకున్న డెలివరీ ఏజెంట్ నేరుగా వితాయతిల్‌పై దాడికి దిగాడు. విచక్షణారహితంగా ఆయన ముక్కుపై బలంగా గుద్దడంతో వితాయతిల్ కిందపడిపోయారు. దీంతో భయపడిపోయిన డెలివరీ ఏజెంట్ ఆర్డర్ చేసిన వస్తువులను అక్కడే పారేసి క్షణాల్లోనే పరారయ్యాడు. అయితే కాసేపటికే తేరుకున్న బాధితుడు తీవ్ర రక్తస్రావం కావడంతో వెంటనే ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడే పరీక్ష చేసిన వైద్యులు అతడి ముక్కు ఎముక విరిగినట్లు ధ్రువీకరించారు. దీంతో వైద్యుల సమాచారం మేరకు పోలీసులు బాధితుడి ఫిర్యాదును స్వీకరించారు. నిందితుడి వివరాల కోసం పోలీసులు బ్లింకిట్ సంస్థను సంప్రదించారు. ఆ ఏజెంట్ ఫోన్ నంబర్, నివాస వివరాలను సేకరించి నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా ఈ ఘటనపై బ్లింకిట్ తీవ్రంగా స్పందించింది. తమ ప్లాట్‌ఫారమ్‌లో ఇలాంటి హింసాత్మక చర్యలకు తావులేదని, సదరు ఏజెంట్‌ను శాశ్వతంగా బ్లాక్ చేశామని పేర్కొంది. బాధితుడికి అవసరమైన చట్టపరమైన సహకారాన్ని అందిస్తామని సంస్థ స్పష్టం చేసింది.
0 Comments