ఆంధ్రప్రదేశ్ లో దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. దివ్యాంగ శక్తి పథకం ద్వారా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగుతోంది. మంగళగిరి బస్టాండ్ నుంచి దివ్యాంగులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌లు బస్సు ప్రయాణం చేశారు. మంగళగిరి నుంచి పెనుమాక వరకు దివ్యాంగులతో కలిసి నేతల ప్రయాణం సాగింది. సుమారు 11 కిమీ మేర దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. ప్రజా ప్రభుత్వం వచ్చాక దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్. పథకం ప్రారంభం సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు, కూటమి పార్టీల కార్యకర్తలు, లబ్దిదారులు తరలి వచ్చారు.
0 Comments