Ad Code

జడ్చర్లలో పాఠశాల మొదటి అంతస్తు పై నుంచి కింద పడ్డ విద్యార్థికి తీవ్ర గాయాలు


తెలంగాణలోని జడ్చర్ల పట్టణంలోని స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో మొదటి అంతస్తు పై నుంచి కింద పడి విద్యార్థి తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనను పాఠశాల యాజమాన్యం గుట్టుచప్పుడు కాకుండా ఉంచడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంటర్నేషనల్ స్వామి నారాయణ గురుకుల పాఠశాలలో జడ్చర్ల బ్రాంచ్ లో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి (13) పాఠశాలల్లోని మొదటి అంతస్తు పై నుంచి కింద పడడంతో తలకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఈ ఘటనను దాచిపెట్టి గుట్టు చప్పుడు కాకుండా జడ్చర్ల పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా చికిత్స నిమిత్తం హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పాఠశాల ప్రిన్సిపాల్ ను వివరణ కోరగా.. త్వరగా విద్యార్థికి గాయాలైన విషయం వాస్తవమేనని రెండు మూడు కుట్లు పడ్డాయని ఈ ఘటన అంతా పెద్ద విషయం ఏమీ కాదని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ స్వామి నారాయణ తెలిపారు. కాగా, ఈ పాఠశాలలో గతంలో పాఠశాల ఉపాధ్యాయుడు విద్యార్థిని చితకబాదాడంతో కర్ణభేరి పగిలిన ఘటన మరువకముందే మరోసారి అదే పాఠశాలలో విద్యార్థి భవనం పైనుంచి పడి తీవ్ర గాయాలు కావడం పట్ల పాఠశాల నిర్వహణపై విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు స్పందించి పాఠశాల యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu