Ad Code

యూఏఈపై ఇరాన్‌ భీకర దాడులు : కుప్పకూలుతోన్న ప్రపంచ పెట్టుబడుల హబ్‌ స్థిరత్వం


యూఏఈపై ఇరాన్‌ డ్రోన్‌ దాడులు తీవ్రం చేసింది. దుబాయ్‌ విమానాశ్రయాలు, ఆకర్షణల స్థలాలు లక్ష్యాలుగా మారడంతో ప్రపంచ పెట్టుబడుల హబ్‌ స్థిరత్వం కుప్పకూలుతోంది. ట్రంప్‌ ప్రభుత్వానికి యూఏఈ నుంచి వచ్చిన భారీ పెట్టుబడులను దెబ్బతీసే ఇరాన్‌ వ్యూహం విజయవంతమవుతోంది. అబుదాబి జాయెద్‌ విమానాశ్రయం, దుబాయ్‌ పామ్‌ జుమేరా ప్రాంతాలపై 137 బాలిస్టిక్‌ క్షిపణులు, 209 డ్రోన్లు ప్రయోగించిన ఇరాన్‌ భారీ నష్టం కలిగించింది. డ్రోన్‌ శకలాలు తగిలి ఒకరు మృతిచెందారు. 11 మంది గాయపడ్డారు. దుబాయ్‌ ఎయిర్‌పోర్టు తాత్కాలిక మూసివేశారు. 2025లో ట్రంప్‌ ప్రభుత్వానికి 5.2 ట్రిలియన్‌ పెట్టుబడులు వచ్చాయి. ఇందులో 27% యూఏఈ నుంచే వచ్చాయి. ఈ క్రమంలో తాజాగా ఇరాన్‌ దాడులు దుబాయ్‌ ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తూ అమెరికా ఆర్థిక వ్యవస్థను పరోక్షంగా లక్ష్యం చేస్తోంది. భారత్‌కు చెందిన 800 కంపెనీలు కూడా అమెరికాలో 1.3 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు పెట్టాయి. అమెరికా సైనిక స్థావరాలు, విమానాశ్రయాలు, చమురు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ 'మా శత్రువులకు ఆశ్రయం ఇస్తే మూల్యం చెల్లించాలి' అనే సందేశం ఇస్తోంది. 2019 సౌదీ ఆయిల్‌ దాడుల మోడల్‌ను విస్తరించి గల్ఫ్‌ దేశాల్లోకి తీసుకువచ్చింది. తక్కువ ఖర్చుతో భారీ ఆర్థిక నష్టం కలిగించే డ్రోన్‌ యుద్ధం విజయవంతమవుతోంది. ఇక యూఏఈ, దుబాయ్‌లో భారత్‌ కూడా పెట్టుబడులు పెట్టింది. తాజా ఇరాన్‌ దాడులతో భారత్‌ పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి.

Post a Comment

0 Comments

Close Menu