Ad Code

పోలీస్ స్టేషన్ గేటు ఎదుట దారుణంగా హత్య !


ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు పోలీస్ స్టేషన్ గేటు ఎదుట ఇద్దరు వ్యక్తులు ఓ వ్యక్తిపై వేట కొడవళ్లతో దాడిచేసి దారుణంగా హత్య చేశారు. వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. రాగినేపల్లికి చెందిన ఈశ్వరప్ప అనే వ్యక్తిపై హరి, చిన్నప్ప వేటకొడవళ్లతో దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హరి భార్యతో ఈశ్వరప్ప అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. నాలుగు రోజుల క్రితం హరి భార్యను ఈశ్వరప్ప తీసుకెళ్లిపోయాడు. భార్య కనపడటం లేదని హరి పోలీస్ స్టేషన్ లో  ఫిర్యాదు చేశాడు. హరి ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేశారు. పోలీసులు ఈశ్వరప్ప, హరి భార్యకోసం వెతుకులాట ప్రారంభించగా నెల్లూరులో ఉన్నట్లు సమాచారం అందింది. దీంతో నెల్లూరులో ఉంటున్న ఈశ్వరప్పతో పాటు హరి భార్యను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సోమవారం తెల్లవారుజామున తనకల్లు పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తీసుకొచ్చారు. ఈ విషయం తెలుసుకున్న హరి, చిన్నప్ప అర్ధరాత్రి 3 గంటల సమయంలో కాపుకాచి పోలీస్ స్టేషన్ గేటు ఎదుట కారు దిగి స్టేషన్లోకి వెళ్తున్న ఈశ్వరప్ప  ను అన్నదమ్ములు ఇద్దరు కొడవళ్లతో దాడి చేసి నరికి చంపారు. 

Post a Comment

0 Comments

Close Menu