తెలంగాణలో భవన నిర్మాణ నిబంధనల్లో భారీ మార్పులు : జీవో జారీ చేసిన ప్రభుత్వం


తెలంగాణ ప్రభుత్వం భవన నిర్మాణ నిబంధనల్లో పలు మార్పులు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. భవన నిర్మాణాల్లో ట్రాన్స్‌ఫరేబుల్‌ డెవలప్‌మెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌) వినియోగానికి సంబంధించి ప్రభుత్వం కొత్త జీవో జారీ చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, ఇకపై 21 మీటర్లు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్న కట్టడాలను మాత్రమే 'హై-రైజ్' (బహుళ అంతస్థుల) భవనాలుగా పరిగణిస్తారు. గతంలో ఈ పరిమితి తక్కువగా ఉండేది. చిమ్నీలు, కూలింగ్ టవర్లు, లిఫ్ట్ మెషిన్ రూమ్‌లు, వాటర్ ట్యాంకులను ఈ ఎత్తు లెక్కించేటప్పుడు మినహాయిస్తారు. అలాగే 750 నుండి 2,000 చదరపు మీటర్ల విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో 18 నుండి 21 మీటర్ల ఎత్తు వరకు భవనాల నిర్మాణానికి అనుమతి ఇచ్చారు, అయితే దీనికి టీడీఆర్ వినియోగించడం తప్పనిసరి. భవన నిర్మాణంలో వదిలిపెట్టే సెట్‌బ్యాక్ నిబంధనల్లోనూ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. సాధారణ భవనాల్లో రోడ్డు విస్తరణ దృష్ట్యా సెట్‌బ్యాక్స్‌లో మినహాయింపు పొందవచ్చు. హై-రైజ్ భవనాల విషయానికి వస్తే, అన్ని వైపులా కనీసం 7 మీటర్ల సెట్‌బ్యాక్ ఉండేలా చూసుకుంటూ, అనుమతించబడిన సెట్‌బ్యాక్స్‌లో 10 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. మాస్టర్ ప్లాన్ రోడ్ల మార్పులు లేదా తొలగింపుల సమయంలో డెవలప్‌మెంట్ ఛార్జీలకు బదులుగా తత్సమానమైన టీడీఆర్ సమర్పించే అవకాశాన్ని కూడా కల్పించారు. రోడ్డు వెడల్పును బట్టి అదనపు అంతస్థుల నిర్మాణానికి అనుమతి లభించనుంది. 2,000 చదరపు మీటర్ల కంటే ఎక్కువ విస్తీర్ణం ఉన్న ప్లాట్లలో.. 40 అడుగుల రోడ్డు ఉంటే 3 అంతస్థులు, 60 అడుగుల రోడ్డుకు 4 అంతస్థులు, 80 అడుగుల రోడ్డు ఉంటే 5 అదనపు అంతస్థుల వరకు నిర్మించుకోవచ్చు. అయితే దీనికి అగ్నిమాపక మరియు ఎయిర్‌పోర్ట్ భద్రతా నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. 10 నుండి 20 అంతస్థుల భవనాలకు 3 శాతం, 20 అంతస్థుల పైన ఉంటే 5 శాతం అదనపు బిల్ట్-అప్ ఏరియాను టీడీఆర్ ద్వారా పొందవచ్చు. భవన అనుమతి సమయంలో 50 శాతం, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ముందు మిగిలిన 50 శాతం టీడీఆర్ సమర్పించాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains