ఆస్ట్రేలియాలోని హోబర్ట్ వేదికగా ఆదివారం జరిగిన మూడో వన్డేలో ఆస్ట్రేలియా 185 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో ఆసీస్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 409 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ అలీసా హీలీ (98 బంతుల్లో 27 ఫోర్లు, 2 సిక్స్‌లతో 158), బెత్ మూనీ(84 బంతుల్లో 10 ఫోర్లు, సిక్స్‌తో 106 నాటౌట్) సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో శ్రీచరణి(2/106), స్నేహ్ రాణా(2/66) రెండేసి వికెట్లు తీయగా.. రేణుక సింగ్, కాశ్వీ గౌతమ్, దీప్తి శర్మ తలో వికెట్ తీసారు. అనంతరం భారత్ 45.1 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రోడ్రిగ్స్(29 బంతుల్లో 9 ఫోర్లతో 42), స్నేహ్ రాణా(74 బంతుల్లో 6 ఫోర్లతో 44) టాప్ స్కోరర్లుగా నిలవగా.. ప్రతీకా రావల్(27), స్మృతి మంధాన(0), హర్మన్ ప్రీత్ కౌర్(25), హర్లీన్ డియోల్(14), దీప్తి శర్మ(29), రిచా ఘోష్(18), కాశ్వీ గౌతమ్(0), శ్రీచరణి(11)తీవ్రంగా నిరాశపర్చారు. ఆస్ట్రేలియా బౌలర్లలో అలాన కింగ్(4/33) నాలుగు వికెట్లు తీయగా.. జార్జియో వేర్‌హమ్(2/3) రెండు వికెట్లు పడగొట్టింది. నికోల క్యారీ, అన్నాబెల్ సదర్లాండ్, అష్లే గార్డ్‌నర్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌తో అలీసా హీలీ తన కెరీర్‌కు వీడ్కోలు పలికింది. తన ఆఖరి మ్యాచ్‌లో అద్భుతమైన శతకంతో ఆకట్టుకుంది.
0 Comments