కర్ణాటకలోని తుమకూర్ లో ఉన్న శ్రీ సిద్ధార్థ్ మెడికల్ కాలేజీలో ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్.. అదే కాలేజీలో చదువుతున్న ఓ విద్యార్థినికి క్లాస్ రూమ్ ముందే ఐ లవ్ యూ చెప్పాడు. దాంతో ఆగ్రహానికి గురైన విద్యార్థులు ఆ ప్రొఫెసర్ ను చితకబాదారు. ఈ కాలేజీకి హెడ్ అయిన కర్ణాటక హోం మంత్రి జీ. పరమేశ్వర ఆ ప్రొఫెసర్ ను సస్పెండ్ చేశారు. అబ్దుల్ అనే ప్రొఫెసర్ ఓ కాలేజీ ఈవెంట్ లో మాట్లాడుతూ " ఈ బ్యాచ్ నాకు ఇచ్చిన ప్రేమను మరువలేను. అలాగే ఈ బ్యాచ్ లోని ఓ ముఖ్యమైన విద్యార్థినికి నేను ప్రొపోజ్ చేయాలని అనుకుంటున్నాను. ఆ తర్వాత నేను బ్యాచ్ మొత్తానికి చాక్లేట్స్ పంచిపెడతాను. ఐ లవ్ యూ అని అందరిముందు ఆ విద్యార్థినికి చెప్పాడు. దాంతో ఆగ్రహించిన విద్యార్థులు అతడ్ని చితకబాదారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రొఫెసర్ అబ్దుల్ అందరి ముందూ ఐ లవ్ యూ చెప్పి పోడియం కిందకు దిగుతుండగా విద్యార్థులు అతడికి అడ్డుపడి ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ కొద్దిసేపు వాగ్వాదం చేసుకున్నాక అక్కడే సదరు విద్యార్థిని ప్రొఫెసర్ ను చెప్పుతో కొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
0 Comments