Ad Code

న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో విమానాన్ని ఢీకొట్టిన అగ్నిమాపక యంత్రం !


మెరికాలోని న్యూయార్క్ లాగార్డియా విమానాశ్రయంలో కెనడాలోని మాంట్రియల్ ట్రూడో అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరిన ఎయిర్ కెనడా విమానం (ఫ్లైట్ నంబర్ 8646) సురక్షితంగా ల్యాండ్ అయిన తర్వాత రన్ వే పై ప్రమాదానికి గురైంది. విమానం రన్ వే నుండి ట్యాక్సీ వే మీదుగా ప్రయాణీకుల గేట్ వైపు వెళ్తున్న క్రమంలో, అక్కడ వేగంగా వస్తున్న ఒక అగ్నిమాపక యంత్రం విమానాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ విమానంలో 100 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ల్యాండింగ్ విజయవంతంగా ముగిసిందని ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో ఒక్కసారిగా పెద్ద శబ్దంతో భారీ షాక్ తగలడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ఘటనలో ప్రయాణికులెవరికీ ఎటువంటి గాయాలు కాలేదని, అందరూ క్షేమంగా ఉన్నారని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. విమానం, ఫైర్ ట్రక్ పాక్షికంగా దెబ్బతిన్నాయి. సంఘటన జరిగిన వెంటనే విమానాశ్రయ భద్రతా సిబ్బంది, అత్యవసర సేవా బృందాలు అక్కడికి చేరుకున్నాయి. ప్రయాణికులను సురక్షితంగా విమానం నుండి దించి బస్సుల ద్వారా టెర్మినల్ వైపు తరలించారు. అసలు విమానం వెళ్లే దారిలోకి ఫైర్ ట్రక్ ఎలా వచ్చింది? సిగ్నలింగ్ లో ఏవైనా లోపాలు ఉన్నాయా? లేదా కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఈ పొరపాటు జరిగిందా? అనే కోణంలో ఉన్నతాధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

Post a Comment

0 Comments

Close Menu