తిరుమల కొండపై దివ్వెల మాధురి, బిగ్‌బాస్ ఫేమ్ తనూజ టీటీడీ నిబంధనలను అతిక్రమించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం వివాదానికి దారితీసింది. గురువారం శ్రీవారి దర్శనం కోసం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌తో కలిసి దివ్వెల మాధురి, తనూజ తిరుమలకు చేరుకున్నారు. వీరు శ్రీపద్మావతి విచారణ కేంద్రం పరిధిలోని 'శ్రీవిభవ' అతిథి గృహంలో బస చేశారు. అయితే, తనూజ పుట్టినరోజు సందర్భంగా మాధురి బయట నుండి కేక్‌ను తీసుకువచ్చి, నిబంధనలకు విరుద్ధంగా గదుల్లోనే కేక్ కట్ చేయించారు. ఈ వేడుకకు సంబంధించిన దృశ్యాలను వీడియో తీసి మాధురి తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన చోట ఇటువంటి ప్రైవేట్ వేడుకలు నిర్వహించడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
0 Comments