డియోగో గార్సియా టార్గెట్ గా ఇరాన్ మిస్సైల్స్ ప్రయోగించింది. డియోగో గార్సియో అనేది హిందూ మహా సముద్రంలోని ఓ ద్వీపం. ఇది అమెరికా, బ్రిటన్ దేశాలు ఉమ్మడిగా నిర్వహిస్తున్న సైనిక స్థావరం. డియోగో గార్సియో సైనిక స్థావరం నుంచి ఈ రెండు దేశాలకు చెందిన సైనిక శక్తి మోహరించి ఉంటుంది. ఇది ఇరాన్ దేశానికి 4 వేల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 21వ తేదీ తెల్లవారుజామున ఇరాన్ రెండు మిస్సైల్స్ ప్రయోగించింది. ఈ మిస్సైల్స్ పేరు ఖొర్రంషహర్. వీటిలో 1, 2, 3, 4 రకాలు ఉన్నాయి. వీటి రేంజ్ 2 వేల కిలోమీటర్లు మాత్రమే అనేది అమెరికా దగ్గర ఉన్న సమాచారం. ఇలాంటి ఖొర్రంషహర్ మిస్సైల్స్ రెండింటిని ఇరాన్ ప్రయోగించింది. వీటి టార్గెట్ డియోగో గార్సియో సైనిక స్థావరం. ఇరాన్ చర్యతో అమెరికా, ఇజ్రాయెల్ షాక్ అయ్యాయి. 4 వేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని టార్గెట్ చేయటం అంటే.. అది కూడా 4 వేల కిలోమీటర్ల దూరంలోని ఆర్మీ బేస్ లక్ష్యంగా చేసుకోవటం అంటే ఇరాన్ దగ్గర 4 వేల కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్స్ ఉన్నట్లే కదా అనే అంచనాకు వస్తున్నాయి అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు. ఇప్పటి వరకు వాళ్ల అంచనాలకు భిన్నంగా ఇరాన్ చర్య ఉండటంతో అందరూ షాక్ అవుతున్నారు. ఇరాన్ ప్రయోగించిన ఖొర్రంషహర్ మిస్సైల్స్ ను మధ్యలోనే అమెరికా, ఇజ్రాయెల్ దళాలు కూల్చేశాయి. ఇరాన్ ప్రయోగించిన క్షిపణి ఒకటి మధ్యలోనే ఫెయిల్ అయ్యింది. మరో క్షిపణిని అమెరికా నౌకాదళం కూల్చేసింది. ఇరాన్ దగ్గర 4 వేల కిలోమీటర్ల రేంజ్ మిస్సైల్స్ ఉన్నాయా అనేది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఇరాన్ దగ్గర ఉన్న ఖొర్రంషహర్ మిస్సైల్స్ పరిధిలోకి ఇప్పుడు యూరప్ దేశాలన్నీ వస్తున్నాయి. ఇరాన్ నుంచి 3 వేల కిలోమీటర్ల పరిధిలోనే లండన్, పారిస్ తోపాటు యూరప్ దేశాల్లోని చాలా దేశాలు ఇప్పుడు ఇరాన్ మిస్సైల్స్ పరిధిలోకి వస్తాయని ఆందోళన చెందుతున్నాయి ఆయా దేశాలు. ఇరాన్ ఇప్పుడు ప్రయోగించిన ఈ మిస్సైల్స్ టెక్నాలజీ ఉత్తరకొరియా, రష్యా నుంచి తీసుకున్నట్లు అంచనా వేస్తున్నారు. ఆ రెండు దేశాల సహకారంతోనే ఇరాన్ ఈ మిస్సైల్స్ తయారు చేసి ఉంటుందని అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు భావిస్తున్నాయి.
0 Comments