పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు


వాణిజ్య అవసరాల కోసం వినియోగించే 19 కేజీల సిలిండర్ ధరలు ఒక్కో సిలిండర్‌పై రూ. 28 పెరిగింది. పెరిగిన రేట్లు ఈ తెల్లవారు జాము నంచి అమలులోకి వచ్చాయి. వీటితో పలు కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. ఎల్‌పీజీ, విమాన ఇంధన ధరల పెంపుతో పాటు రైల్వే, సిమ్ బైండింగ్ వంటి నిబంధనలు మారాయి. 19 కిలోల వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను సవరించినట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వెల్లడించాయి. ఢిల్లీలో 28 రూపాయల మేర పెరిగింది. ఇతర నగరాల్లో దీని ధర 31 రూపాయల వరకు ధరలు పెరిగినట్లు ఓఎంసీలు తెలిపాయి. ధరల పెంపుతో ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య సిలిండర్ ఇప్పుడు రూ. 1,740.50 నుంచి రూ. 1,768.50 కు చేరింది. కోల్‌కతాలో రూ. 1,844.50 నుంచి రూ. 1,875.50, ముంబైలో 1,692.50 నుంచి రూ. 1,720.50 పెరిగింది. చెన్నైలో దీని ధర రూ. 1,929 అయ్యింది. పాత ధర రూ. 1,899.50. ఎల్‌పీజీ ధరలతో పాటు నేటి నుండి విమాన ఇంధనం ధరలు పెరిగాయి. ఇది విమాన ప్రయాణికుల ప్రయాణ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది. ప్రతి నెలా తొలి తేదీన ఏటీఎఫ్ ధరలను సవరించే ఆయిల్ కంపెనీలు, ఈసారి కూడా పెంపును ప్రకటించాయి. కొత్త ధరల ప్రకారం, ఢిల్లీలో ఏటీఎఫ్ కిలోలీటర్‌కు రూ. 91,393.39 నుండి రూ. 96,638.14కు పెరిగింది. కోల్‌కతా- రూ. 94,445.62 నుండి రూ. 99,587.14, ముంబై- రూ. 85,474.63 నుండి రూ. 90,451.87కు, చెన్నైలో రూ. 94,781.99 నుండి రూ. 1,00,280.49 కు చేరాయి. గృహ వినియోగం కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ ధరలో ఎటువంటి మార్పు లేదు. 14.2 కిలోల గృహ ఎల్పీజీ సిలిండర్ రేట్లు యధాతథంగా కొనసాగుతున్నాయి. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains