Ad Code

తలేఘాన్ అణు కేంద్రం ధ్వంసం : ఇజ్రాయెల్ రక్షణ దళాలు ప్రకటన


రాన్‌లో ఉన్న ఓ న్యూక్లియర్ కేంద్రాన్ని తాజా దాడుల్లో ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ రక్షణ దళాలు పేర్కొన్నాయి. ఆ కేంద్రం నుంచి ఇరాన్ అణ్వాయుధాలను డెవలప్ చేస్తున్నదని, కీలకమైన పరీక్షలు చేపడుతున్న ఆ కేంద్రంపై దాడి చేసినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. టెహ్రాన్‌కు ఆగ్నేయంగా సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న తలేఘాన్ కాంపౌండ్‌పై ఇజ్రాయెల్ వైమానిక దళాలు దాడి చేసినట్లు ఐడీఎఫ్ చెప్పింది. ఈ కేంద్రం నుంచి ఇరాన్ ఇటీవల కాలంలో అత్యాధునిక విస్పోటక పదార్ధాలను తయారు చేసినట్లు ఐడీఎఫ్ ఆరోపించింది. ఏఎంఏడీ ప్రాజెక్టు కోసం ఇక్కడే అత్యంత సున్నితమైన పరీక్షలు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. అణ్వాయుధాల తయారీ కోసం ఇరాన్ అత్యంత రహస్యంగా అమద్ ప్రాజెక్టును చేపడుతున్న విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ప్రకారం.. అమద్ ప్రాజెక్టులో భాగంగా 1989 నుంచి 2003 వరకు తలేఘాన్ కేంద్రంలో ఇరాన్ అణ్వాయుధాలు డెవలప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2024 అక్టోబర్‌లో జరిగిన దాడిలో కూడా తలేఘాన్ కాంపౌండ్ దెబ్బతిన్నది. అయితే ఈ కాంపౌండ్‌ను మళ్లీ పునర్ నిర్మిస్తున్నారని తెలిసిందని, ఈ నేపథ్యంలో దాన్ని టార్గెట్ చేసినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ చెప్పింది. తలేఘాన్ అణు కేంద్రం నుంచే ఇరాన్ అణ్వాయుధాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు ఆధారాలు ఉన్నాయని ఇజ్రాయెల్ ఆరోపించింది.

Post a Comment

0 Comments

Close Menu