Ad Code

సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా : 'ఎక్స్ 'లో పీవీ సింధు పోస్టు


జ్రాయెల్-ఇరాన్ ఘర్షణల కారణంగా దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన పీవీ సింధు ఈరోజు బెంగళూరు చేరుకున్నారు. మంగళవారం నుంచి జరగనున్న ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ కోసం గత వారం ఇంగ్లాండ్ బయల్దేరిన సింధు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకుపోయిన సంగతి తెలిసిందే. ఈమేరకు సింధు 'ఎక్స్ 'లో ఒక పోస్టు పెట్టారు. సురక్షితంగా బెంగళూరుకు చేరుకున్నా. గత కొద్ది రోజులు అత్యంత అనిశ్చిత పరిస్థితులు ఎదుర్కొన్నా. ఎట్టకేలకు ఇంటికి చేరుకోగలిగా. ఈ క్లిష్ట సమయంలో మమ్మల్ని సురక్షితంగా చూసుకునేందుకు దుబాయ్ అధికారులు, ఎయిర్‌పోర్టు సిబ్బంది, ఇమిగ్రేషన్ అధికారులు అందించిన సేవలను మాటల్లో చెప్పలేను. వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రస్తుతం విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నా. తేరుకున్నాక భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆలోచిస్తా అని సింధు తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో గత శనివారం నుంచి విమాన సర్వీసులు రద్దు కావడంతో ఆమె ప్రయాణం ఆగిపోయింది. అప్పటినుంచి దుబాయ్‌లోనే సురక్షిత ప్రాంతంలో ఉండాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే యూఏఈ, భారత్ అధికారుల సమన్వయంతో అక్కడ చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేశారు. దీంతో సింధు బెంగళూరుకు చేరుకున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu