Ad Code

బీహార్‌లో అభ్యర్థి ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రణ


బీహార్‌లోని బిక్రమ్‌గంజ్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ధావా గ్రామానికి చెందిన రితేష్ కుమార్‌ అడ్మిట్ కార్డులో అతని ఫోటోకు బదులుగా కుక్క ఫోటో ముద్రించారు. ఈ సంఘటన అభ్యర్థిని తీవ్ర కలతకు గురిచేసింది. ఇది మరోసారి నియామక ప్రక్రియ, ఆన్‌లైన్ దరఖాస్తు వ్యవస్థ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. రితేష్ 2022 లో సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. కొన్ని కారణాల వల్ల నియామక ప్రక్రియ ఆలస్యం కాగా, తాజాగా ఈ నియామక పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. అడ్మిట్ కార్డ్ డౌన్ లోడ్ చేసుకున్న రితేష్ షాక్ అయ్యాడు. అడ్మిట్ కార్డులోని పేరు, ఇతర సమాచారం సరైనవే, కానీ తన ఫోటోకు బదులుగా, కుక్క చిత్రం ముద్రించి ఉండడంతో షాక్ తిన్నాడు. ఈ సంఘటన వెలుగులోకి వచ్చిన తర్వాత రితేష్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. తప్పుకు బోర్డునే కారణమని నిందించాడు. నేను ఈ విషయం గురించి సంబంధిత బోర్డు, విభాగానికి ఫిర్యాదు చేశాను. పరీక్ష రాయడంలో నాకు ఎటువంటి సమస్యలు రాకుండా ఈ తప్పును సరిదిద్దాలని కోరినట్లు తెలిపాడు. సివిల్ కోర్టులో ప్యూన్ పోస్టులకు రాత పరీక్ష మార్చి 15న జరగనుంది. రితేష్ సెంటర్ సహర్సాలో ఉంది. తన అడ్మిట్ కార్డులో ఉన్న ఈ తీవ్రమైన లోపం గురించి రితేష్ ఆందోళన చెందుతున్నాడు. సమయం మించిపోతోందని, ఈ లోపాన్ని వీలైనంత త్వరగా సరిదిద్దకపోతే, పరీక్ష రాయడంలో తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెబుతున్నాడు.

Post a Comment

0 Comments

Close Menu