Ad Code

రంగు చాల్లాడని కోపంతో మరుగుతున్న నీటిని చిన్నారిపై పోసిన అమ్మమ్మ


హారాష్ట్ర లోని నాగ్‌పూర్‌, కోరాడి ప్రాంతం, అరాంషిన్ వార్డు నంబర్ 2లో హోలీ పండుగ సమీపిస్తుండటంతో, ఓం హరీష్ వాంగే (4) అనే చిన్నారి ఇంటి బయట పెయింట్ నింపిన స్ప్రే బాటిల్‌తో ఆడుకుంటున్నాడు. అదే సమయంలో ఆ బాలుడి అమ్మమ్మ సింధు థాకరే, హోలీ వేడుకల కోసం నీటిని మరిగించి బకెట్‌లో నింపుతోంది. ఆడుకుంటూ చిన్నారి పొరపాటున తన స్ప్రే బాటిల్‌తో అమ్మమ్మపై రంగు చల్లాడు. తనపై రంగు పడిందన్న ఆగ్రహంతో విచక్షణ కోల్పోయి, చేతిలో ఉన్న మరుగుతున్న నీటిని ఆ పసివాడిపై పోసేసింది. వేడినీరు పడటంతో ఆ పసివాడు బాధ తో గిలగిలలాడిపోయాడు. నడుము కింద భాగమంతా తీవ్రంగా కాలిపోయింది. బాలుడి అరుపులు విన్న స్థానికులు వెంటనే అతడిని నాగ్‌పూర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల అంచనా ప్రకారం, ఆ చిన్నారికి 45 శాతం కాలిన గాయాలు అయ్యాయి. ప్రస్తుతం ఆ బాలుడు ప్రాణాలతో పోరాడుతున్నాడు. మార్చి 3న జరిగిన ఘటనంతా అక్కడి సీసీ టీవీ కెమెరాలో రికార్డైంది. ఆ దృశ్యాలను చూస్తే ఎవరికైనా ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న కోరాడి పోలీసులు బుధవారం కేసు నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించారు. సొంత మనవడిపైనే ఇంతటి క్రూరత్వానికి పాల్పడిన సింధు థాకరేపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu