Ad Code

నేను అధికారంలో ఉన్నంత వరకూ ఎన్ఆర్‌సీని అనుమతించను!

శ్చిమ బెంగాల్ లోని నక్సల్‌బరీలో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాల్గొని మాట్లాడుతూ  ఓటర్ల జాబితా సవరణ పేరుతో కేంద్ర ప్రభుత్వం ప్రజలు హక్కులు లాక్కుంటోందని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ఈరోజు ఓటుహక్కును లాక్కున్న వారు రేపు ఎన్ఆర్‌సీ పేరుతో పౌరసత్వాన్ని కూడా లాక్కుంటారని విమర్శించారు. అయితే తాను అధికారంలో ఉన్నంత వరకూ రాష్ట్రంలో ఎన్‌ఆర్‌సీని అనుమతించేది లేదని చెప్పారు. రాష్ట్రంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో నిర్దిష్ట కమ్యూనిటీలను ఎన్నికల ప్రక్రియ నుంచి మినహాయించారు. ఎస్ఐఆర్ ద్వారా రాజ్‌‍బన్షి పేర్లను తొలగించారు. మహిళల పేర్లు కూడా తొలగించారు. ఎస్ఐఆర్ వల్ల మరణాలు చోటుచేసుకుంటే దానికెవరు బాధ్యత వహిస్తారు?' అని మమతా బెనర్జీ ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని ఎన్నికల కమిషన్, బీజేపీ, కేంద్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇవాళ ప్రజల ఓటింగ్ హక్కులను లాక్కున్న వారు రేపు ఎన్‌ఆర్‌సీ పేరుతో పౌరసత్వ హక్కులను లాక్కుంటారని ఆరోపించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్, నరేంద్ర మోదీ, అమిత్‌షా పేర్లను నేరుగా ప్రస్తావించకుండా, ఈ ముగ్గురికీ ఓటర్లు ఉద్వాసన పలకాలని కోరారు. 'వాళ్లు నానుంచి అన్నీ లాక్కున్నారు. ఇప్పుడు నా చేతుల్లో ఉన్నదల్లా ప్రజలు మాత్రమే' అని అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu