చార్‌ధామ్ యాత్రలో భాగమైన కేదార్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను మూసివేయనున్నారు. చార్‌ధామ్ యాత్ర ఎంతో పవిత్రమైనది. ఈ యాత్ర ప్రతి సంవత్సరం వేసవికాలంలో మొదలయ్యి శీతాకాలంలో ముగుస్తోంది. మొదట యమునోత్రి నుంచి ప్రారంభమై గంగోత్రి, కేదార్‌నాథ్, చివరిగా బద్రీనాథ్ ఆలయాన్ని మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. రుద్రనాథ్ ప్రవేశ ద్వారాలు ఈ నెల 17వ తేదిన మూసుకోనున్నాయి. వీటితోపాటు గంగోత్రి ఆలయం వచ్చే నెల 2వ తేదిన మధ్యాహ్నం 12.14 గంటలకు మూసివేస్తారు. అలాగే, కేదార్‌నాథ్, యమునోత్రి ఆలయాలను నవంబర్ 3వ తేదిన మూసివేస్తున్నట్లు వెల్లడించారు. నవంబర్ 4వ తేదిన తుంగనాథ్ ఆలయాన్ని మూసివేస్తారు. వీటితోపాటు బద్రీనాథ్ ఆలయాన్ని నవంబరు 17న రాత్రి 9.07 గంటలకు మూసివేయనున్నట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ తెలిపారు. ఆ రోజు సాయంత్రం చివరి పూజ నిర్వహించి, అఖండ జ్యోతిని వెలిగించి ఆలయ ద్వారాలను మూసివేస్తారు. నవంబర్ 20వ తేదీన మధ్యమహేశ్వర్ ఆలయం మూతపడనుంది.
0 Comments