ఆంధ్రప్రదేశ్ లోని అద్దంకి కార్యకర్తల సమావేశంలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాట్ ను తానే తెచ్చానని జగన్ చెప్పుకున్నారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ చేస్తున్నారని దొంగే దొంగా..దొంగ అని అరిచినట్లుగా ఆరోపణలు చేశారు. నిజంగా ఐదేళ్ల కాలంలో ఆయన హయాంలో ఎక్కడైనా ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ అనే మాటే వినిపించలేదు. ఆదిత్య మిట్టల్ తో ఓ ఫోటో దావోస్ లో దిగారు. దాన్ని పట్టుకుని తానే తెచ్చాని ఏ మాత్రం సిగ్గుపడుకండా జగన్ చెప్పుకుంటున్నాడు. జగన్ రెడ్డి ప్రజా ఆస్తులు..ప్రభుత్వ నిధులు మాత్రమే కాదు.. వేరే వాళ్ల విజయాలను కూడా సునాయాసంగా చోరీ చేయగలడని నిరూపిస్తున్నారని ఆయన సమావేశానికి హాజరైన కార్యకర్తలే ఆశ్చర్యపోయారు. ఐదేళ్ల పాలనలో రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రాకపోయినా, ఇప్పుడు కూటమి ప్రభుత్వం చొరవతో వస్తున్న సంస్థలను తనవేనని చెప్పుకోవడం జగన్ రెడ్డి నైజనికి సాక్ష్యంగా మారింది. సీఎంగా ఉన్నప్పుడు పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రాకపోగా.. వచ్చిన వారు వెళ్లిపోయారు. అది కళ్ల ముందు ఉన్న నిజం. ఇప్పుడు రాష్ట్రంలో మారుతున్న రాజకీయ, పారిశ్రామిక వాతావరణాన్ని చూసి, ఆ క్రెడిట్ తనకే దక్కాలన్నట్లుగా జగన్ మాట్లాడుతున్నారు. ఆర్సెలార్ మిట్టల్ ప్రాజెక్టు విషయంలో ఆయనకు ఎలాంటి సంబంధం లేకపోయినా తనదే విజయం అని చెప్పుకోవడంపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. గూగుల్ ఏఐ సెంటర్ నుంచి అన్ని విషయాల్లోనూ ఇదే విధంగా క్రెడిట్ చోరీ చేసేందుకు తన వద్ద మీడియా, సోషల్ మీడియాను నిస్సంకోచంగా వాడుకుంటున్నారు. ఆయన పాలనను ప్రజలు మర్చిపోరు. అప్పుడే జరిగిందోఅందరికీ గుర్తుండే ఉంటుంది. అయినా అలవోకగా అబద్దాలు చెప్పి క్రెడిట్ చోరీ చేస్తున్నారంటే.. జగన్ రెడ్డి ప్రజల్ని చాలా తక్కువగా అయినా వేయాలి..లేదా ఆయన మానసిక స్థితి అయినా తేడాగా ఉండి ఉండాలని టీడీపీ నేతల సెటైర్లు వేస్తున్నారు.
0 Comments