భారత మహిళల హాకీ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. సెమీ ఫైనల్‌కు చేరడం ద్వారా ప్రపంచకప్‌కు అర్హత సాధించాలన్న మొదటి లక్ష్యాన్ని చేరుకుంది. దాంతో చాంపియన్లుగా నిలవాలన్న పట్టుదలతో ఆటగాళ్లు ఉన్నారు. సెమీఫైనల్‌లో బలమైన ఇటలీని ఎదుర్కోవడం భారత జట్టుకు అసలైన పరీక్ష కానుంది. సెమీఫైనల్ వంటి కీలక మ్యాచ్‌కు ముందు జట్టు వ్యూహాలపై కోచ్, ప్లేయర్లు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రత్యర్థి జట్టు ఇటలీ డిఫెన్స్‌ను ఎలా ఛేదించాలనే దానిపై పక్కా ప్రణాళికలతో కసరత్తు చేస్తున్నారు. జట్టులో ఉన్న యువ రక్తం , అనుభవజ్ఞుల కలయిక భారత్‌కు ప్రధాన బలంగా మారింది.
0 Comments