రాజ్యసభకు 10 రాష్ట్రాల్లో ఖాళీ కానున్న 37 స్థానాల కోసం జరిగే ద్వైవార్షిక ఎన్నికలకు మార్చి 16న పోలింగ్ జరగనుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్ల దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 5 కాగా, మార్చి 6న వాటి పరిశీలన జరుగుతుంది. అభ్యర్థులు మార్చి 9 వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ ఎన్నికలలో పోటీ చేసే వారి జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పార్టీ ప్రకటన ప్రకారం ఫూలో దేవి నేతం (ఛత్తీస్‌గఢ్), కరంవీర్ సింగ్ బౌధ్ (హర్యానా), అనురాగ్ శర్మ (హిమాచల్ ప్రదేశ్), ఎం. క్రిస్టోఫర్ తిలక్ (తమిళనాడు), అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి (తెలంగాణ) లకు అవకాశం ఇచ్చింది. తనపై నమ్మకం ఉంచిన కాంగ్రెస్ అధిష్టానానికి నరేందర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఎఐసిసి జనరల్ సెక్రటరీ కె.సి. వేణుగోపాల్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో వెల్లడించారు.
0 Comments