ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ప్లాట్ ఫామ్ ఫీజును పెంచిన జొమాటో


జొమాటో ఆన్ లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసే వారికి ప్లాట్ ఫామ్ ఫీజును పెంచింది. ప్రతి ఆర్డర్ పై 2 రూపాయల 40 పైసలు చొప్పున ఫీజు పెంచింది. ఈ సమాచారాన్ని కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేసింది. ప్రస్తుతం ప్లాట్ ఫామ్ ఫీజు 12 రూపాయల 50 పైసలుగా ఉంది. ఇప్పుడు సవరించిన ధరలతో ఆ ఫీజు 14 రూపాయల 90 పైసలకు పెరిగింది. మరో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీ ఇప్పటికే ఆర్డర్ పై 14 రూపాయల 99 పైసలు చొప్పున ప్లాట్ ఫామ్ ఫీజును వసూలు చేస్తోంది. యుద్ధం కారణంగా మిడిల్ ఈస్ట్ లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. గ్యాస్ కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. గ్యాస్ ధరలు పెరిగాయి. మరోవైపు చమురు ధరలు భారీగా పెరిగాయి. పెరుగుతున్న ఇంధన ధరలు డెలివరీ కార్యకలాపాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ కారణంగా ప్లాట్ ఫామ్ ధరలు పెంచక తప్పడం లేదని ఫుడ్ డెలివరీ యాప్స్ అంటున్నాయి.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org