Ad Code

ఛాంపియన్స్ ఎడిషన్ కొత్త ఎలక్ట్రిక్ ఓలా వాహనాలు విడుదల


ఓలా ఎలక్ట్రిక్ సూపర్ హిట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా S1 ప్రో+, ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఓలా రోడ్ స్టర్ X+ లను  'ఛాంపియన్స్ ఎడిషన్'గా  లాంచ్ చేసింది. ఈ ప్రత్యేక ఎడిషన్‌ను ఐసీసీ టీ20 వరల్డ్ కప్ లో భారత పురుషుల క్రికెట్ జట్టు విజయం సాధించిన సందర్భంగా వీటిని తీసుకువచ్చింది. ఈ ప్రత్యేక మోడళ్లలో భారత క్రికెట్ జట్టు ప్రేరణతో రూపొందించిన ప్రత్యేకమైన నీలం రంగు (బ్లూ లివరీ) డిజైన్‌ను అందించారు. స్కూటర్, మోటార్‌సైకిల్ బాడీ ప్యానెల్స్‌ పై ఈ డిజైన్ కనిపిస్తుంది. భారత క్రికెట్ జట్టు ఈ టోర్నమెంట్లో గెలిచిన మూడో టైటిల్‌ కు గౌరవంగా ఈ ఎడిషన్‌ను రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ ఛాంపియన్స్ ఎడిషన్లో ప్రధానంగా డిజైన్‌ లో మాత్రమే మార్పులు చేశారు. మెకానికల్ ఫీచర్లు, ఇతర స్పెసిఫికేషన్లు సాధారణ మోడళ్ల మాదిరిగానే ఉన్నాయి. ఓలా S1 Pro+ ఛాంపియన్స్ ఎడిషన్ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.54 లక్షల నుండి ప్రారంభం కానుండగా.. Ola రోడ్ స్టర్ X+ ఛాంపియన్స్ ఎడిషన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.09 లక్షలుగా నిర్ణయించారు. ఈ రెండు వాహనాల అమ్మకాలు 2026 ఏప్రిల్ చివరి వరకు కొనసాగుతాయని కంపెనీ తెలిపింది. ఓలా S1 ప్రో+ ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు బ్యాటరీ ఎంపికలతో అందుబాటులో ఉంది. 4 kWh బ్యాటరీ ప్యాక్, 5.2 kWh బ్యాటరీ ప్యాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్‌ లో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ 17.43 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం 130 కిమీ/గంట వరకు ఉంటుంది. ఇది 0 నుంచి 40 కిమీ వేగాన్ని కేవలం 2.1 సెకన్లలో అందుకుంటుంది. 4 kWh బ్యాటరీతో 242 కిలోమీటర్ల వరకు రేంజ్ అందిస్తే, 5.2 kWh బ్యాటరీతో 320 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu