Ad Code

రెవెన్యూ శాఖలో భూముల మ్యూటేషన్ల వ్యవహారంలో భారీ అక్రమాలు : అధికారులపై కొరడా ఝుళిపించిన ప్రభుత్వం


ఆంధ్రప్రదేశ్ లోని మార్కాపురం ప్రాంతంలో రెవెన్యూ శాఖలో భూముల మ్యూటేషన్ల వ్యవహారంలో జరిగిన భారీ అక్రమాలు సంచలనం రేపుతున్నాయి. విధుల్లో నిర్లక్ష్యం, నిబంధనల ఉల్లంఘనకు పాల్పడిన అధికారులపై ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. ఈ అక్రమాలపై విచారణ జరిపిన ఇన్‌చార్జ్ కలెక్టర్ రాజాబాబు, పెద్దారవీడు ఎంఆర్‌ఓ దిలీప్ కుమార్, దేవరాజుగట్టు వీఆర్‌ఓ విజయభాస్కర్ రెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తహసీల్దార్ దిలీప్ కుమార్ మెడికల్ లీవ్‌లో ఉన్న సమయంలోనే 30కి పైగా భూముల మ్యూటేషన్లు నిర్వహించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సెలవులో ఉండి కూడా అధికారిక లాగిన్ ఉపయోగించి ఇంత భారీ సంఖ్యలో మ్యూటేషన్లు ఎలా చేశారన్న దానిపై ఉన్నతాధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా 25కు పైగా కేసులు నమోదు చేసినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ముఖ్యంగా దేవరాజుగట్టు గ్రామానికి చెందిన 19 మ్యూటేషన్లు పూర్తిగా అనుమానాస్పదంగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఎటువంటి సరైన ఆధారాలు, పత్రాలు లేకుండానే భూముల నమోదు ప్రక్రియ పూర్తి చేసినట్లు తేలింది. ఈ అక్రమాల్లో మరికొంత మంది కిందిస్థాయి సిబ్బంది హస్తం ఉందా అనే కోణంలో విచారణ కొనసాగుతోంది.

Post a Comment

0 Comments

Close Menu