ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. దీనికి ప్రతీకారంగా ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ గ్యాస్ క్షేత్రంపై ఇరాన్ దాడి చేసింది. దీంతో మరోసారి మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తాజా దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌లోని సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ మాత్రమే దాడి చేసింది. అందులో అమెరికాకు గానీ ఖతార్‌కు గానీ ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. పశ్చిమాసియాలో చోటుచేసుకున్న పరిణామాలపై కోపంతో ఇరాన్‌లోని ప్రధాన గ్యాస్ కేంద్రంలోని ఒక భాగాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుందని, అయినా ఈ దాడి గురించి వాషింగ్టన్‌కు ముందుగా ఎటువంటి సమాచారం లేదని, ముఖ్యంగా ఇందులో ఖతార్‌కు ఎలాంటి సంబంధం లేదని ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఖతార్‌లోని ఎల్‌ఎన్‌జీ మౌలిక సదుపాయాల్లోని ఒక భాగంపై అన్యాయంగా దాడి చేసిందని ఆరోపించారు. ఇరాన్ మరొకసారి ఖతార్‌ను లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తే మాత్రం పరిణామాలు తీవ్రంగా ఉంటాయని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఇరాన్ సౌత్ పార్స్ మైదానంపై ఇజ్రాయెల్ కూడా దాడులకు పాల్పడదని ట్రంప్ హామీ ఇచ్చారు. అయినా కూడా ఇరాన్ హద్దులు మీరి ప్రవర్తిస్తే మాత్రం ఇజ్రాయెల్ ప్రమేయం లేకుండానే సౌత్ పార్స్ మైదానంపై అమెరికా అత్యంత శక్తివంతమైన బలప్రయోగం ద్వారా ప్రతీకారం తీర్చుకుంటుందని ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు.
0 Comments