Ad Code

కరాచీలో అమెరికా కాన్సులేట్ కు నిప్పు పెట్టిన ఆందోళనకారులు : కాల్పుల్లో తొమ్మిది మంది మృతి


రాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేనీ మృతితో ప్రపంచవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పాకిస్థాన్ లోని కరాచీ నగరంలో ఆందోళనకారుల నిరసన రణరంగంగా మారింది. తమ మత గురువుగా భావించే సుప్రీం లీడర్ ఖమేనీ మరణంతో ఆందోళన కారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కరాచీలో ఉన్న అమెరికా కాన్సులేట్ ను ముట్టడించిన ఆందోళనకారులు దానికి నిప్పంటించారు, దీంతో పోలీసులు వారిని చెదరగొట్టడానికి టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ నిరసన కారులు వెనక్కు తగ్గకపోవడంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘర్షణల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా 18 మంది వరకు గాయపడినట్లు తెలుస్తోంది. ఖమేనీని అమెరికా-ఇజ్రాయెల్ దళాలు చంపేశాయని తెలియడంతో ఆగ్రహించిన షియా సమాజానికి చెందిన ప్రజలు పెద్ద ఎత్తున కరాచీలోని ఎం.టీ ఖాన్ రోడ్డు లో ఉన్న అమెరికా ఎంబసీని ముట్టడించేందుకు ప్రయత్నించారు. నిరసనకారులు ఎంబసీ సమీపంలోకి చేరుకోగానే పరిస్థితి ఉద్రిక్తత నెలకొంది. నిరసనకారులు ఎంబసీ కిటికీలు, తలుపులను ధ్వంసం చేసి భవనంలోని కొన్ని భాగాలకు నిప్పు పెట్టారు. గుంపును చెదరగొట్టడానికి పోలీసులు తొలుత టియర్ గ్యాస్ ను ప్రయోగించి, లాఠీచార్జ్ చేశారు. అయినప్పటికీ ఆందోళన కారులు వెనక్కు తగ్గక పోవడంతో గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో జరిగిన కాల్పుల్లో తొమ్మిది మంది మరణించినట్లు ఈధి రెస్క్యూ సర్వీస్ ధృవీకరించింది. మృతదేహాలతో పాటు గాయపడిన వారిని కరాచీ సివిల్ హాస్పిటల్ ట్రామా సెంటర్కు తరలించినట్లు వివరించింది.

Post a Comment

0 Comments

Close Menu