తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా బ్యానర్‌లో సంగుతేవన్ అనే సినిమా స్టార్ట్ చేశాను. కానీ, అది మధ్యలోనే ఆగిపోయింది. దానివల్ల రూ.1.75 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ తర్వాత ఆరెంజ్ మిఠాయి, మేకు తొడర్చి మలై, జుంగ, లాభం సినిమాలు తీశాను. వీటిలో ఒక్కటి కూడా నాకు లాభాల్ని తెచ్చిపెట్టలేదు. కనీసం పెట్టిన పెట్టుబడి వెనక్కు తీసుకురావడంలో కూడా విఫలమయ్యాయి. బాక్సాఫీస్ లెక్కలపరంగా అవి ఫ్లాప్ అయినప్పటికీ నాకు మాత్రం ఆ సినిమాలన్నీ ఇష్టం. కాబట్టి వాటిని నిర్మించినందుకు నేనేం బాధపడటం లేదు అన్నాడు. ప్రస్తుతం విజయ్ సేతుపతి నటుడిగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. తమిళంలో మిస్కిన్ దర్శకత్వంలో ట్రైన్ మూవీ చేస్తున్నాడు. తెలుగులో పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో స్లమ్‌డాగ్: 33 టెంపుల్ రోడ్ చేస్తున్నాడు. ఇది కాకుండా పాకెట్ నోవెల్, జైలర్ 2, అరసన్‌తో పాటు మణిరత్నం మూవీ ఒకటి ఆయన చేతిలో ఉన్నాయి.
0 Comments