Ad Code

విశాఖ-తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ కొత్త రైలు


విశాఖ-తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలును క్రమబద్ధీకరిస్తూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు ఎప్పటి నుంచి ఈ మార్పు అమల్లోకి వస్తుంది, కొత్త సమయాలను కూడా వెల్లడించారు. విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18507 ఏప్రిల్ 6 నుంచి ప్రతీ సోమవారం ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. అలాగే తిరుపతి-విశాఖ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 18508 ఏప్రిల్ 7 నుంచి ప్రతీ మంగళవారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది. విశాఖ-తిరుపతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రతీ సోమవారం విశాఖలో రాత్రి 7.10కి బయలుదేరి తిరుపతికి మరుసటి రోజు ఉదయం 8.35కి చేరుతుంది. అలాగే తిరుపతి నుంచి బయలుదేరే రైలు మంగళవారం రాత్రి 9.50కి బయలుదేరి మరుసటి రోజు మధాహ్నం 1.30కి విశాఖకు చేరుకుంటుంది. ఈ రెండు రైళ్లకు హాల్ట్ స్టేషన్లను కూడా రైల్వే ప్రకటించింది. ఇందులో విశాఖపట్నం నుంచి చూస్తే దువ్వాడ, అనకాపల్లి, యలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట ఉన్నాయి. ఈ రైళ్లలో సెకండ్ ఏసీ, ధర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ క్లాస్, దివ్యాంగుల బోగీలు ఉంటాయని అధికారులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu