అమరావతిలో పిడుగుపడి ఒకరు మృతి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాలవర్షాలు పడుతున్నాయి. ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో వున్నట్లుండి వర్షాలు పడుతున్నాయి. అమరావతిలో ఉరుములు, మెరుపులతో వడగండ్ల వాన కురిసింది. పిడుగుపడి ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. విజయవాడ నగరంలో బుధవారం సాయంత్రం గం. 3.45 నిమిషాలకు ఉరుములు, మెరుపులతో ప్రారంభమైన వర్షం 5 గంటల వరకూ ఏకధాటిగా కురిసింది. నగరంలో వాహనదారులు ఇబ్బందులుపడ్డారు. పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, ప్రకాశం జిల్లాల ప్రజలు అప్రమత్తంగా వుండాలనీ, చెట్ల కిందకు వెళ్లవద్దని, రక్షణ షెల్టర్లలో మాత్రమే వుండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలియజేసింది.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org