న్యూజిలాండ్‌లోని మౌంట్ మౌంగనీ వేదికగా ఆదివారం తొలి టీ20లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఓపెనర్ డెవాన్ కాన్వే అర్ధ శతకం (60)తో ఆకట్టుకున్నాడు. నిక్ కెలీ (12 బంతుల్లో 21), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (14 బంతుల్లో 21), కోల్ మెకాంచి (12 బంతుల్లో 18), జోష్ క్లార్క్‌సన్ (9 బంతుల్లో 26) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో న్యూజిలాండ్ ఆరు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది. సఫారీ బౌలర్లలో వియాన్ ముల్డర్ రెండు వికెట్లు, గెరాల్డ్ కోయెట్జి, ఒట్నీల్ బార్ట్‌మాన్, కెప్టెన్ కేశవ్ మహరాజ్, జార్జ్ లిండే తలా ఒక వికెట్ తీశారు. లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా మొదటి నుంచి ఆఖరి వరకూ తడబడుతూనే వచ్చింది. జార్జ్ లిండే 12 బంతుల్లో 33 పరుగులు సాధించడం మినహా మిగిలిన వారంతా చేతులెత్తేయడంతో 15.1 ఓవర్లలో 107 పరుగులకే సౌతాఫ్రికా ఆలౌట్ అయింది.
0 Comments