ఇరాన్‌కు చైనా 2,00,000 డాలర్ల విరాళంగా అందించనుంది. ఈ నిధులు చైనా రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా ఇరాన్ రెడ్ క్రెసెంట్ సొసైటీకి అందజేస్తామని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. ప్రస్తుతం, ఇరాన్ ప్రజలు ఎదుర్కొంటున్న క్లిష్టపరిస్థితుల్ని అధిగమించేందుకు ఈ మానవతా సాయం సహాయపడుతుందని చైనా పేర్కొంది. మరోవైపు, యుద్ధంలో కూడా చైనా ఇరాన్‌కు మద్దతు ఇస్తుందనే వాదనలు ఉన్నాయి. చైనా తన తన శాటిలైట్స్ ద్వారా యూఎస్ మిలిటరీ ఆస్తుల వివరాలను అందిస్తోందని పలు కథనాలు వెల్లడించాయి. దీని ద్వారానే ఇరాన్ అత్యంత ఖచ్చితత్వంతో దాడులు చేస్తుందని అనుమానిస్తున్నాయి. ఇదే కాకుండా ఇరాన్ వద్ద ఉన్న మిస్సైల్ టెక్నాలజీకి కూడా డ్రాగన్ కంట్రీ సాయం చేసిందనే అనుమానాలు ఉన్నాయి.
0 Comments