Ad Code

ఏప్రిల్ 2న వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ విడుదల


దేశీయ మార్కెట్లో ఏప్రిల్ 2న వివో వి 70 FE స్మార్ట్ ఫోన్ ను వివో ప్రకటించింది. ఈ ఫోన్ కోసం అమెజాన్ ఇండియా ప్రత్యేకంగా అందించింది మైక్రో సైట్ టీజర్ పేజీ నుంచి ఈ ఫోన్ కీలక ఫీచర్లు కూడా రిలీజ్ చేసింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ కంప్లీట్ కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ రిలీజ్ చేసింది. ఈ ఫోన్ లో దూల రియర్ కెమెరా ఉంటుంది. ఇందులో CIPA 4.0 OIS అల్ట్రా స్టెబిలైజేషన్ సపోర్ట్ కలిగిన 200MP మెయిన్ కెమెరా మరియు జతగా 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ లో 50MP ఐ AF గ్రూప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది. ఈ ఫోన్ కలిగిన కెమెరా సెటప్ తో 30x సూపర్ జూమ్, సూపర్ మోషన్ స్నాప్ షాట్, మరియు AI వెథర్ చేంజ్ వంటి లేటెస్ట్ AI కెమెరా ఫీచర్స్ కూడా ఉన్నాయి. ప్రీమియం డిస్ప్లే సెటప్ కలిగి ఉన్నట్లు కూడా వివో వెల్లడించింది. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ కలిగిన 6.8 ఇంచ్ బిగ్ డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే 1900 నిట్స్ పీక్ బ్రైట్నెస్, HDR 10+ సపోర్ట్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కూడా కలిగి ఉంటుంది. ఇది మంచి గేమింగ్ మరియు ఎంటర్టైన్మెంట్ కోసం కూడా గొప్పగా ఉంటుందని వివో తెలిపింది. ఇది కాకుండా ఆడియోకి తగిన సౌండ్ అందించే డ్యూయల్ స్పీకర్ సెటప్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో అందించింది. డార్క్నెస్ గ్లో టెక్నాలజీ కలిగి మొదటి ఫోన్ గా వస్తోంది. ఇది చీకటిగా ఉన్నప్పుడు వెనుక ప్యానల్ వెలుగుతుంది. ఈ ఫోన్ IP 68 అండ్ IP69 రేటింగ్ తో గొప్ప డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 1.5 మీటర్ల లోతులో రెండు గంటల వరకు వాటర్ ను తట్టుకునే శక్తితో అందించినట్లు వివో తెలిపింది. భారీ బ్యాటరీ సెటప్ తో లాంచ్ అవుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో 7000 mAh బిగ్ బ్యాటరీ ఉందని కంపెనీ కన్ఫర్మ్ చేసింది. ఇదే కాదు ఈ ఫోన్ 90W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్ కూడా అందించింది. ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ లో కూడా ఈ బిగ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.

Post a Comment

0 Comments

Close Menu