Ad Code

బంగారం కోసం మహిళను దారుణంగా హత్య చేసిన నిందితుడు


గుజరాత్ లోని మెహసానా జిల్లా ఇంద్రద్ గ్రామంలో 54 ఏళ్ల శారదాబెన్ ఠాకూర్ అనే మహిళ అదృశ్యం కావడం, ఆపై ఆమె శవమై కనిపించడం స్థానికంగా పెను కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు కేవలం 10 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. మార్చి 20వ తేదీన శారదాబెన్ ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఆమె కోసం గాలించగా ఫలితం లేకపోయింది. చివరకు సీసీటీవీ కెమెరాలను పరిశీలించగా, ఆమె 'సవితా అమృత్ ఫామ్' అనే తోటలోకి వెళ్లినట్లు కనిపించింది. కానీ ఆమె తిరిగి బయటకు వచ్చిన దృశ్యాలు ఎక్కడా లేవు. అనుమానంతో పోలీసులు ఆ తోటను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అక్కడ ఒక నిమ్మ చెట్టు కింద మట్టిని కొత్తగా తవ్వినట్లు గుర్తించారు. ఆ మట్టిపై ఈగలు ముసురుతుండటంతో అనుమానం వచ్చి తవ్వగా శారదాబెన్ మృతదేహం బయటపడింది. నిందితుడు సచిన్ కుమార్ దంతాని, శారదాబెన్‌ను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న నగలను దోచుకున్నాడు. కేవలం బంగారం కోసం ఆమె చెవులను కూడా కోసేసి, సుమారు రూ. 4.40 లక్షల విలువైన ఆభరణాలతో పరారయ్యాడు. మృతదేహాన్ని ఎవరికీ తెలియకుండా తోటలోనే పాతిపెట్టాడు. నిందితుడు కిలో వెండి పట్టీలను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నాడన్న పక్కా సమాచారంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఉన్న అప్పుల భారం వల్లే ఈ హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. పోలీసులు నిందితుడి నుంచి హత్యకు వాడిన ఆయుధాన్ని, రూ. 3.40 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకుని,నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu