Ad Code

చీపురుపల్లిలో 'ఆకాశ' నిఘా : 12 మందిపై కేసులు నమోదు


ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా చీపురుపల్లి, గుడ్లవాని చెరువు మెట్ట కాలనీ ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో బహిరంగంగా మద్యం సేవించి శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న 12 మందిని పోలీసులు గుర్తించి, వారిపై కేసులు నమోదు చేశారు. పట్టుబడిన 12 మందిని త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ ఇన్‌స్పెక్టర్ ఎల్. దామోదర్ రావు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ పట్టణంలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించడం. గుంపులు గుంపులుగా చేరి అల్లర్లకు పాల్పడటం లాంటి చర్యలకు పాల్పడే వారిని డ్రోన్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు కనిపెడుతున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu