ఐక్యూ జెడ్11 ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ విడుదల : 16 నుంచి అమ్మకాలు ప్రారంభం


దేశీయ మార్కెట్లో ఐక్యూ జెడ్ 11ఎక్స్ 5జీ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. శక్తివంతమైన ప్రాసెసర్, భారీ బ్యాటరీ, అధిక రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి ఆకర్షణీయమైన ఫీచర్లతో ఈ మోడల్ వినియోగదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోన్ గత సంవత్సరం విడుదలైన iQOO Z10x 5G కు వారసత్వంగా వచ్చింది. మునుపటి మోడల్‌లో ఉన్న చిప్‌సెట్‌తో పోలిస్తే ఈసారి మరింత శక్తివంతమైన ప్రాసెసర్‌ను అందించింది. ఈ ఫోన్‌లో MediaTek Dimensity 7400 Turbo ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4nm టెక్నాలజీ ఆధారంగా రూపొందించిన ఈ చిప్‌సెట్ 2.5GHz వరకు క్లాక్ స్పీడ్‌ను అందిస్తుంది. గ్రాఫిక్స్ పనితీరును మెరుగుపరచేందుకు Mali-G615 MC2 GPUను జత చేశారు. కంపెనీ ప్రకారం ఈ ప్రాసెసర్ దాదాపు 10 లక్షల వరకు AnTuTu స్కోర్ సాధించగలదని పేర్కొంది. ఇది గేమింగ్, మల్టీటాస్కింగ్ వంటి పనుల్లో మంచి పనితీరును అందిస్తుందని చెప్పింది. 6.76 అంగుళాల Full HD+ (2408×1080 pixels) ఎల్సీడీ డిస్‌ప్లే అందించారు. ఈ డిస్‌ప్లేకు 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. దీంతో స్క్రోలింగ్, గేమింగ్ అనుభవం మరింత స్మూత్‌గా ఉంటుంది. అదనంగా గరిష్టంగా 1200 నిట్స్ బ్రైట్‌నెస్ సపోర్ట్ ఉండటంతో సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఫోన్‌లో ప్రధాన ఆకర్షణ 7200mAh భారీ బ్యాటరీ. గత మోడల్‌లో ఉన్న 6500mAh బ్యాటరీ కంటే ఇది పెద్దది. దీన్ని 44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందించారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువసేపు ఉపయోగించుకోవచ్చని కంపెనీ చెబుతోంది. గేమింగ్, వీడియో స్ట్రీమింగ్, సోషల్ మీడియా వంటి పనులు ఎక్కువసేపు చేసే వినియోగదారులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో Sony సెన్సర్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరా (f/1.8) ఉంది. దీనికి 2MP డెప్త్ సెన్సర్ (f/2.4) కూడా జత చేశారు. LED ఫ్లాష్ సపోర్ట్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు భాగంలో 32MP ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. ముఖ్యంగా ఫ్రంట్ కెమెరా కూడా 4K వీడియో రికార్డింగ్కు సపోర్ట్ చేయడం ప్రత్యేకతగా చెప్పవచ్చు. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ ఫోన్ Android 16 ఆధారిత Funtouch OS పై పనిచేస్తుంది. కంపెనీ 2 సంవత్సరాల Android అప్‌డేట్లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని ప్రకటించింది. డ్యూరబిలిటీ విషయానికి వస్తే ఈ ఫోన్‌కు IP68 మరియు IP69 డస్ట్ & వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అంతేకాకుండా MIL-STD-810H మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ సర్టిఫికేషన్ కూడా లభించింది. ఈ స్మార్ట్‌ఫోన్ మార్చి 16 నుంచి అమెజాన్, ఐక్యూ ఇండియా అధికారిక ఆన్‌లైన్ స్టోర్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. లాంచ్ ఆఫర్‌లలో భాగంగా ఎంపిక చేసిన బ్యాంక్ క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే ₹2,000 వరకు తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అదనంగా 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా అందుబాటులో ఉంది. 

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains