Ad Code

రెండు వేల పాయింట్లకు పైగా దూసుకెళ్లిన సెన్సెక్స్


మెరికాతో వాణిజ్య ఒప్పందంపై స్పష్టత రావడంతో ఇన్వెస్టర్లలో ఉత్సాహం ఉప్పొంగింది. ఉదయం మార్కెట్ తెరచిన క్షణం నుంచి ముగింపు వరకు బుల్‌ రన్ ఆగకుండా సాగింది. ఫలితంగా సెన్సెక్స్ రెండు వేల పాయింట్లకు పైగా దూసుకెళ్లగా, నిఫ్టీ కీలకమైన 25,700 స్థాయిని దాటి నిలిచింది. ఈ భారీ ర్యాలీతో బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజులోనే సుమారు రూ.12 లక్షల కోట్లు పెరిగింది. మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.467.35 లక్షల కోట్లకు చేరి మదుపర్ల సంపదను కొత్త రికార్డుకు తీసుకెళ్లింది. సెన్సెక్స్ ప్రారంభంలోనే సుమారు 3,600 పాయింట్ల లాభంతో 85,323 స్థాయిలో తెరచుకుంది. ఇంట్రాడేలో 85,871 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరకు 2,072 పాయింట్ల లాభంతో 83,739 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా జోరు చూపిస్తూ 26,341 స్థాయిని తాకి, చివరకు 639 పాయింట్ల లాభంతో 25,727 వద్ద స్థిరపడింది. స్టాక్ మార్కెట్‌తో పాటు రూపాయి కూడా బలపడింది. డాలర్‌తో పోలిస్తే ఒక్కరోజులోనే రూపాయి 1.36 శాతం లాభపడి 90.26 స్థాయికి చేరింది. ఇంత బలమైన రికవరీ ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి.

Post a Comment

0 Comments

Close Menu